ఎట్టకేలకు ఏపీలో పడవ తరగతి పరీక్షల ఫలితాలను విడుదల చేసే తేదీని ప్రభుత్వం ప్రకటించింది. అధికారిక సమాచారం ప్రకారం రేపు ఉదయం 11 గంటలకు ఫలితాలను మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేయనున్నారు. ఈ విషయంపై తాజాగా మంత్రి బొత్స మాట్లాడుతూ పోయిన సంవత్సరం పదవ తరగతి ఫలితాలు పరీక్షలు పూర్తి అయ్యాక 28 రోజుల్లో ప్రకటించాం. కానీ ఈ సంవత్సరం మాత్రం ఎప్పుడూ లేని విధంగా పరీక్షలు ముగిసిన 18 రోజుల్లోనే విడుదల చేస్తున్నాము అంటూ గర్వంగా చెప్పుకొచ్చారు. ఇందులో ఏ విధమైన లీక్ లేకుండా చాలా పారదర్శకంగా ఈ ఫలితాలను విడుదల చేస్తున్నాం అన్నారు.
కాగా ఈ ఉదయం వరకు ఫలితాలు ఎప్పుడొస్తాయా అంటూ ఎదురుచూసిన విద్యార్థులకు ఒక ఉపశమనం కలిగింది అని చెప్పాలి. మరి రేపు రానున్న ఈ ఫలితాలలో ఉత్తీర్ణత శాతం మరియు ఇతర వివరాలు తెలియాలంటే రేపు మధ్యాహ్నం వరకు ఆగాల్సిందే.