ఐపీఎల్ 2023: రికార్డుల రారాజు కింగ్ కోహ్లీ… నయా రికార్డ్ !

-

ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు ఎన్నో రికార్డులు సృష్టించారు, వాటిని బ్రేక్ చేశారు. అయితే ఎక్కువగా ఐపీఎల్ లో రికార్డులు సృష్టించిన ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క కింగ్ కోహ్లీ అని చెప్పాలి. తాజాగా జరుగుతున్న ఈ ఐపీఎల్ సీజన్ 16 లోనూ సరికొత్త రికార్డును సృష్టించి ఎంతో మంది యంగ్ ప్లేయర్ లకు గేమ్ విషయంలో ఆదర్శంగా నిలిచాడు. ఈ రోజు ఐపీఎల్ లో భాగంగా బెంగుళూరు జట్టు ఢిల్లీతో మ్యాచ్ ఆడుతోంది. ఈ మ్యాచ్ లో ఐపీఎల్ లో 7000 పరుగుల మైలురాయిని అందుకుని మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. కోహ్లీ ఐపీఎల్ కెరీర్ లో 233 మ్యాచ్ లు ఆడగా 130 స్ట్రైక్ రేట్ తో 54 మ్యాచ్ లలో 50 + స్కోర్ చేశాడు.

ఇది మాత్రమే కాకుండా ఢిల్లీ క్యాపిటల్స్ పైన 1000 పరుగులు కూడా పూర్తి చేసుకున్నాడు. కాగా ఈ మ్యాచ్ లో కోహ్లీ అర్ద సెంచరీ సాధించి జట్టుకు విలువైన స్కోర్ ను అందించాడు.

 

Read more RELATED
Recommended to you

Latest news