IPL లో DC తో మ్యాచ్ లో ఆర్సిబి ఆటగాడు కోహ్లీ రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్ లో 55 పరుగులు చేసిన కోహ్లీ…. ఐపిఎల్ లో 50వ హాఫ్ సెంచరీ పూర్తి చేసి అత్యధిక అర్థ సెంచరీలు చేసిన ఆటగాళ్లు జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు.
డేవిడ్ వార్నర్ 59 హాఫ్ సెంచరీలతో తొలి స్థానంలో ఉండగా… కోహ్లీ(50), ధావన్ (49), రోహిత్ శర్మ (41) హాఫ్ సెంచరీలతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. DC పై అత్యధిక అర్థసెంచరీలు (9) చేసిన ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. అటు ఐపీఎల్ లో మరో మైలురాయిని అందుకున్న కోహ్లీ. ఆర్సిబి స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఐపిఎల్ లో మరో మైలురాయిని అందుకున్నారు. శనివారం ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్లో 12 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కోహ్లీ 7వేల పరుగులు మార్క్ ను చేరుకున్నాడు.