మనం అనుసరించే పద్ధతులు బట్టి మన ఆరోగ్యం ఉంటుంది. మనం మంచి ఆహార పదార్థాలను తీసుకోవడం మంచి అలవాట్లని ఫాలో అవ్వడం వలన ఆరోగ్యం బాగుంటుంది. కానీ ఈ అలవాట్లు ఉంటే మాత్రం ఆరోగ్యం తప్పక పడుతుంది. మరి ఎటువంటి అలవాట్లు ఉండకూడదు..? ఎలా అనుసరించాలి అనే ముఖ్య విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం… రిఫైండ్ షుగర్ ని డైట్ లో తీసుకోవడం అసలు మంచిది కాదు. షుగర్ లెవెల్స్ ని పెంచడంతో పాటు బెల్లీ ఫ్యాట్ పెంచుతుంది. షుగర్ ఎక్కువ తీసుకుంటే బీపీ వంటి ఇబ్బందులు కూడా వస్తాయి. డయాబెటిస్ కూడా రావచ్చు.
సమయానికి చాలామంది ఆహారం తీసుకోరు అలాంటి వాళ్ళకి కూడా ఆరోగ్యం దెబ్బతింటుంది. సరైన సమయానికి భోజనం చేయకపోతే బాడీలో ఇన్సులిన్ సమతుల్యత నాశనం చేసి జీర్ణవ్యవస్థ పై అధి ప్రభావం చూపుతుంది. చాలామంది ఎక్కువగా ఉపవాసాలు ఉంటారు అలా చేయడం వలన మెటబాలిజం పైన ప్రభావం పడుతుంది రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి కూడా.
మాంసాన్ని ఎక్కువ తీసుకోవడం వలన కూడా ఆరోగ్యం దెబ్బతింటుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్ బాగా పెరిగిపోతాయి. గుండెపోటు వంటి ఇబ్బందులు కూడా వస్తాయి. అతిగా ఆహారం తీసుకోవడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. ఎక్కువగా ఆహారం తీసుకుంటే ఉబ్బరం గ్యాస్ మలబద్ధకం మొదలైన సమస్యలు వస్తాయి.
ఫైబర్ లోపం వలన కూడా ఇబ్బందులు వస్తాయి. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉండాలి. ఎసిడిక్ ఫుడ్ లేదా డ్రింక్స్ ని కూడా అస్సలు ఎక్కువగా తీసుకోకూడదు సోడా కూల్డ్రింక్స్ వంటివి తీసుకుంటే ఆరోగ్యం పాడవుతుంది. అన్ని పోషక పదార్థాలు అందేటట్టు బ్యాలెన్స్డ్ ఫుడ్ ని తీసుకోవాలి జంక్ ఫుడ్ ని ఎక్కువ తీసుకుంటే కూడా ఆరోగ్యం పాడవుతుంది.