భారత మత్స్యకారులను విడుదల చేయనున్న పాకిస్తాన్

-

పాకిస్తాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్కడ జైలులో ఉన్న 199 మంది భారత మత్స్యకారులను ఈ వారం చివరలో విడుదల చేయనున్నట్లు పాకిస్తాన్ ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. తమ దేశ జలాల్లో అక్రమంగా చేపల వేట సాగిస్తున్నారనే ఆరోపణతో 199 మంది భారతీయ మత్స్యకారులను పాక్ ప్రభుత్వం అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

ఈ మత్స్యకారులు ప్రస్తుతం పాకిస్తాన్ లోని లాంధీ జైలులో ఉన్నారు. ఈ మత్స్యకారులను లాహోర్ కి పంపి వాఘా సరిహద్దులో భారత అధికారులకు అప్పగించనున్నారు. ఈ మత్స్యకారులను శుక్రవారం విడుదల చేయనున్నారు. మత్స్యకారులతో స్వదేశానికి తరలించవలసిన భారతీయ పౌరఖైదీ జుల్ఫికర్ అనారోగ్యం కారణంగా శనివారం కరాచీలోని ఆసుపత్రిలో మరణించడంతో పాకిస్తాన్ అధికారులు సహృద్భావంతో వారిని విడుదల చేయనున్నట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news