అధికారంలో ఉన్నప్పుడు ఏం పీకారు – కాంగ్రెస్ పై KTR ఫైర్

-

నేడు మంచిర్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు మంత్రి కేటీఆర్. ఈ పర్యటనలో భాగంగా దేవాపూర్ లోని ఓరియంట్ సిమెంట్ ఫ్యాక్టరీ విస్తరణకు భూమి పూజ చేశారు. అనంతరం బెల్లంపల్లిలో 30 కోట్లతో చేపట్టిన రోడ్ల నిర్మాణానికి, 44 కోట్లతో చేపట్టిన మిషన్ భగీరథ పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం బెల్లంపల్లి పాలిటెక్నిక్ కాలేజీలో ఎస్సీ, ఎస్టీ వసతి గృహాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత బెల్లంపల్లిలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

 

రేవంత్ రెడ్డి ఒక్క ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నారని.. ఒకసారి కాదు 55 ఏళ్లు పాలించింది కాంగ్రెస్ కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి 55 ఏళ్లు అధికారం ఇస్తే ఏం పీకారని ప్రశ్నించారు. గుడ్డి గుర్రాల పళ్ళు తోమార అంటూ ఫైర్ అయ్యారు మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ హయాంలో కరెంటు లేక రైతులు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. అలాంటి కాంగ్రెస్ అధికారం ఇవ్వాలని అడుగుతున్నారని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news