ఐపీఎల్ 2023: ప్లే ఆప్స్ కు చేరే 4 జట్లు అవేనా … !

-

ఐపీఎల్ లో ఇవాళ శనివారం కాబట్టి డబుల్ ధమాకా ఉండనుంది. లీగ్ స్టేజ్ లో ఇక కొన్ని మ్యాచ్ లే మిగిలి ఉన్నందున ప్లే ఆఫ్ లో ఆడనున్న నాలుగు జట్లు ఏవి అన్నది తెలుసుకోవడానికి ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ప్రస్తుతం ఐపీఎల్ లో ఆడుతున్న పది జట్లలో రెండు జట్లకు మినహా మిగిలిన అన్ని జట్లు పోటీలో ఉన్నట్లే లెక్క. వాటిలో చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ , లక్నో సూపర్ జెయింట్స్ రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు, పంజాబ్ కింగ్స్, సన్ రైజర్స్ హైద్రాబాద్ లకు మాత్రం ప్లే ఆఫ్ చేరడానికి ఇంకా అవకాశం ఉంది. కాగా కోల్కతా నైట్ రైడర్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ కు దాదాపుగా అవకాశాలు లేనట్లే.

 

 

ఏదైనా అద్భుతం జరిగితే తప్పించి ప్లే ఆఫ్ నుండి అవుట్ అయినట్లే. ఇక ప్లే ఆప్స్ కు వెళ్లే నాలుగు జట్లలో ఖచ్చితంగా చెన్నై, గుజరాత్ , రాజస్థాన్ మరియు ముంబై జట్లు ఉండొచ్చని ప్రముఖుల అభిప్రాయం. మరి ఏమి జరుగుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news