అగ్నికి ఆహుతైన 1000 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం

-

నేడు, జడ్చర్ల పట్టణంలోని గంగాపూర్ శివారులో ఉన్న పత్తి మార్కెట్ యార్డ్ లో ఉన్న సివిల్ సప్లై గోడౌన్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గోడౌన్ లో ఉన్న 800 కింటాళ్లకు పైగా వివిధ కారణాలతో సీజ్ చేసిన పీడీఎస్ బియ్యం, 100 కింటాళ్లకు పైగా రేషన్ దుకాణాల బియ్యం అగ్నికి ఆహుతమ్ అయ్యింది. 70 వేలకు పైగా గన్నీ సంచులు కాలిపోయాయి.

కాలిపోయిన వాటిలో 13 వేల కొత్త గన్ని సంచులు ఉన్నట్లు సమాచారం. సుమారు రూ. 40 లక్షల ప్రభుత్వ ఆస్తి బూడిది కావడం జరిగింది. గోడౌన్ లో మంటలు అంటుకున్న విషయాన్ని గోడౌన్ కాంట్రాక్టర్ రమేష్ డీటీ కిషోర్ స్థానిక ఫైర్ సిబ్బందికి సమాచారాన్ని తెలియచేసారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న రెండు ఫైర్ ఇంజన్లు మంటలను ఆర్పేందుకు చాల ప్రయత్నం చేసిన కూడా ఎటువంటి ఫలితం లేకపోవడంతో ఘటన స్థలానికి చేరుకున్న జిల్లా సివిల్ సప్లై డీఎం ప్రవీణ్ ఉన్నతాధికారులతో సంప్రదించి గోడౌన్ గోడలను కూల్చేసి మంటలను ఆర్పేందుకు సుమారు నాలుగు గంటల నుంచి ఫైర్ సిబ్బంది విశ్వ ప్రయత్నం చేస్తున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news