కల్తీ సారా తాగి నలుగురు వ్యక్తులు మరణించగా.. మరో 16 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఘటన తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మరకానం పరిసర ప్రాంతంలో శనివారం రోజున కొంతమంది సారా తాగి తిరిగి ఇంటికి వెళ్లాక ఆరుగురు అపస్మారక స్థితిలో పడిపోయారు. వెంటనే వారిని కుటుంబసభ్యులు హాస్పటల్‌కు తరలించారు.
మరక్కనం ఏకియార్ ప్రాంతంలో మే 13వ తేదీన శనివారం కొందరు వ్యక్తులు కల్తీ సారా తాగారు. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత 27 మంది అపస్మారక స్థితిలో పడిపోయారు. వారిని ముండియంబాక్కం, మరక్కనం, పుదుచ్చేరి జిబ్‌మార్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతూ సురేష్, శంకర్, తరణివేల్, రాజమూర్తి మృతి చెందారు. జిప్‌మార్, పిమ్స్ ఆసుపత్రుల్లోని సురేష్, శంకర్, తరణివేల్ మృతదేహాలకు మంత్రులు పొన్ముడి, సెంజి మస్తాన్ నివాళులర్పించారు. అలాగే నార్త్ జోన్ ఐజి కన్నన్, జిల్లా కలెక్టర్ పళని, జిల్లా ఎస్పీ, పుదుచ్చేరి రాష్ట్ర శాసనసభ ప్రతిపక్ష నాయకుడు శివ కూడా మృతదేహాలకు నివాళులర్పించారు.