బ్రేకింగ్ : ఏపీకి వర్షసూచన.. రేపటి నుంచి

-

ఏపీకి ప్రజంట్ మిడ్ సమ్మర్ నడుస్తుంది. ఉదయం 8 గంటల నుంచే సూర్యుడు చెలరేగిపోతున్నాడు. రికార్డ్ రేంజ్‌లో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మధ్యాహ్నం సమయంలో అయితే అసలు బయటకు వెళ్లే పరిస్థితి కూడా లేదు. ఈ సమయంలో కూల్ న్యూస్ చెప్పింది వెదర్ డిపార్ట్‌మెంట్. ద్రోణి/గాలుల నిలిపివేత ఆంధ్ర ప్రదేశ్ నుండి దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో కొనసాగుతున్నది.

Andhra Pradesh: Rain alert for few districts for next five days - Telangana  Today

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలలో గురువారం తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. వేడితో కూడిన మరియు అసౌకర్యమైన వాతావరణము ఏర్పడే అవకాశము ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 2° నుండి 4° లు గుర్తించబడిన తగ్గుదల ఉండే అవకాశము ఉంది. అలాగే శుక్రవారం తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news