ప్రశాంతంగా ముగిసిన పాలిటెక్నిక్ పరీక్ష

-

తెలంగాణలోని ప్రభుత్వ, ప్రయివేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సుల‌తో పాటు ఇతర కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ‘టీఎస్ పాలీసెట్-2023’ ప‌రీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఈ ప్ర‌వేశ ప‌రీక్ష‌కు 92.94 శాతం మంది విద్యార్థులు హాజ‌ర‌య్యారు. బుధ‌వారం ఉద‌యం 11 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 1:30 గంట‌ల వ‌ర‌కు ప‌రీక్ష కొన‌సాగింది. రాష్ట్ర వ్యాప్తంగా 296 కేంద్రాల్లో ప‌రీక్ష నిర్వ‌హించారు. పాలీసెట్ ప్ర‌వేశ ప‌రీక్ష‌కు 58,520 మంది బాలురు, 47,222 మంది బాలిక‌లు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. 54,700 మంది బాలురు, 43,573 మంది బాలిక‌లు ప‌రీక్ష‌కు హాజ‌ర‌య్యారు. మొత్తంగా 1,05,742 మంది ద‌ర‌ఖాస్తు చేసుకోగా, 98,273 మంది హాజ‌రైన‌ట్లు అధికారులు తెలిపారు.

Polycet Exam | ఏపీలో పాలిసెట్‌ పరీక్ష ప్రారంభం-Namasthe Telangana

మొత్తం 120 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పెన్‌ అండ్‌ పేపర్‌(ఆఫ్‌లైన్‌) విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. మల్టిపుల్‌ ఛాయిస్‌ పద్ధతిలో 150 ప్రశ్నలుంటాయి. మొత్తం నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. అవి.. మ్యాథ్స్‌–60, ఫిజిక్స్‌–30, కెమిస్ట్రీ–30, బయాలజీ నుంచి 30 చొప్పున ప్రశ్నలు వస్తాయి. రెండున్నర గంటలు పరీక్ష సమయం ఉంటుంది. పదోతరగతి స్థాయి సిలబస్‌ నుంచి ప్రశ్నలుంటాయి. ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు చొప్పున కేటాయిస్తారు. ఎటువంటి నెగిటివ్‌ మార్కింగ్‌ విధానం అమలులో లేదు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news