Breaking : న్యాయశాఖ బాధ్యతల నుంచి కిరణ్‌ రిజిజు తొలగింపు

-

కేంద్ర కేబినెట్‌లో మార్పులు చేసింది. కేంద్ర న్యాయశాఖ మంత్రిగా కిరణ్ రిజిజు స్థానాన్ని అరుణ్ రామ్ మేఘ్వాల్ భర్తీ చేయనున్నారు. రిజిజుకు వేరే మంత్రిత్వ శాఖను మోదీ ప్రభుత్వం అప్పగించింది. కిరణ్ రిజిజుకు భూవిజ్ఞాన శాస్త్ర శాఖ బాధ్యతలను అప్పగించింది. ఒక్కసారిగా ఈ మార్పులకు కారణం ఇంక తెలియాల్సి ఉంది. ప్రధాని మోదీ కేబినెట్‌లో ఇది పెద్ద పునర్వ్యవస్థీకరణ. కిరణ్ రిజిజు, సుప్రీంకోర్టు కొలీజియం మధ్య చాలా కాలంగా కోల్డ్ వార్ నడుస్తోంది. ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. న్యాయమంత్రి తీరుపై సుప్రీంకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది.

India News LIVE | Union Min Kiren Rijiju loses Law ministry; assigned  different portfolio | India News

కొలీజియం ద్వారా న్యాయమూర్తులను ఎన్నుకోకూడదని కిరణ్ రిజిజు పదే పదే చెప్పారు. న్యాయమూర్తుల నియామకానికి ఇంతకంటే మంచి మార్గం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. చాలా దేశాల్లో ఇదే పద్ధతి అవలంబిస్తున్నదని సుప్రీంకోర్టు కూడా అప్పట్లో చెప్పింది.

సౌరభ్ కృపాల్ కేసు తెరపైకి రావడంతో తొలిసారి ఇద్దరి మధ్య టెన్షన్ బహిరంగంగానే విమర్శలు చేసుకున్నారు. సౌరభ్ కృపాల్‌ను ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా సుప్రీంకోర్టు కొలీజియం నియమించింది. కానీ న్యాయ మంత్రిత్వ శాఖ అతని ఫైల్‌ను ఆమోదించలేదు.

Read more RELATED
Recommended to you

Latest news