ఐపీఎల్ 2023: SRH తో RCB విన్ అవ్వాలంటే.. డిఫెండింగ్ బెటర్ !

-

నేడు హైద్రాబాద్ లో ఐపీఎల్ కీలక మ్యాచ్ కు సర్వం సిద్ధమైంది, సాయంత్రం 7 .30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుండగా.. SRH కు ఈమ్యాచ్ ఫలితం సంబంధం లేకున్నా RCB కి మాత్రం ఇందులో ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన అవసరం ఉంది. ప్లే ఆఫ్ కు వెళ్ళవచ్చు అని అనుకుంటున్న జట్లలో బెంగుళూరు కూడా ఉంది. ఇంపాక్ట్.. అన్నిటికన్నా బెంగుళూరు కు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మిగిలిన రెండు మ్యాచ్ లలో గెలిస్తే ఎటువంటి సమీకరణాలతో పనిలేకుండా డైరెక్ట్ గా బెంగుళూరు ప్లే ఆఫ్ కు చేరుకుంటుంది. అందుకోసం ముందుగా ఈ రోజు మ్యాచ్ లో SRH ను ఓడించాలి. ఈ మ్యాచ్ లో బెంగుళూరు గెలుపు అవకాశాలు మెరుగుపడాలంటే.. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోవాలి, సాధ్యమైనన్ని పరుగులు SRH ముందు ఉంచగలిగితే బౌలింగ్ తో డిపెండ్ చేసుకునే అవకాశం ఉంటుంది.

ఈ పిచ్ మీద ఛేజింగ్ చేయడం చాలా కష్టం.. అదీ కాకుండా బెంగుళూరు కూడా ఛేజింగ్ లో కేవలం ఒక్క మ్యాథక్ మాత్రమే గెలిచింది. డిఫెండింగ్ లో మాత్రం అయిదు మ్యాచ్ లు గెలిచింది. అందుకే టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకుంటే బెటర్.

Read more RELATED
Recommended to you

Latest news