క్రేజీ ఫ్యాన్స్: ఐపీఎల్ 2023 ఫైనల్స్ “RCB VS LSG” జరగాలంటే … !

-

ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్ 16 లో భాగంగా చివరి పది రోజులకు చేరుకుంది. కాగా ప్లే ఆఫ్ లో మిగిలిన 3 స్థానాలను దక్కించుకోవడానికి మొత్తం 7 జట్లు హోరాహోరీగా పోటీ పడుతున్నాయి. తాజాగా ఐపీఎల్ క్రికెట్ ఫ్యాన్స్ మదిలో ఒక అద్భుతమైన ఆలోచన రావడం క్రికెట్ వర్గాలను షాక్ అయ్యేలా చేస్తున్నాయి. కొద్ది రోజులకు ముందు బెంగుళూరు మరియు లక్నో జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో కోహ్లీ కి మరియు నవీనుల హాక్ గంభీర్ ల మధ్యన జరిగిన వివాదం గురించి తెలిసిందే. ఇది ఎంతలా వైరల్ అయిందంటే కోహ్లీ మరియు గంభీర్ ఇద్దరినీ సోషల్ మీడియాలు బద్ద శత్రువులుగా మార్చేశాయి. కాగా ఈ ఐపీఎల్ లో రెండు జట్లు తలదాలని కోరుకుంటున్నాయి, కానీ లీగ్ స్టేజ్ లో అయితే వీరు కలిసి ఆడే గేమ్ లు లేవు. అందుకే ఐపీఎల్ ఫైనల్ లో ఎలాగైనా రెండు జట్లు తలపడాలాని కోరుకుంటున్న ఫ్యాన్స్ ఏ విధంగా జరిగితే రెండు జట్లు ఫైనల్ చేరుతాయో కూడా చెప్పడం విశేషం.

అందులో భాగంగా ఈ రోజు మ్యాచ్ లో SRH పై బెంగుళూరు గెలవాలి, చెన్నై పై ఢిల్లీ గెలవాలి. అదే విధంగా RCB తర్వాత మ్యాచ్ లో గుజరాత్ పై గెలవాలి. దీనితో RCB ప్లే ఆఫ్ కు చేరుకుంటుంది. క్వాలిఫైయర్ 1 లో గుజరాత్ పై లక్నో గెలవాలి. అదే విధంగా క్వాలిఫైయర్ 2 లో గుజరాత్ పై బెంగుళూరు గెలవాలి. అప్పుడు RCB మరియు LSG లు ఫైనల్ చేరుకుంటాయి. ఇక ఆ మ్యాచ్ ఎంతటి మజాను అందిస్తాయో మాటల్లో చెప్పలేము అంటూ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి అలా జరుగుతుందా ?

Read more RELATED
Recommended to you

Latest news