‘యుద్ధభూమిలో వెయిటింగ్’.. అంటూ తారక్​కు హృతిక్ స్పెషల్ విషెస్

-

గ్లోబస్ స్టార్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇవాళ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తారక్​కు సినీ, రాజకీయ, టీడీపీ కార్యకర్తలు, అభిమానులు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. సోషల్ మీడియాలో ఎన్టీఆర్ పుట్టిన రోజు శుభాకాంక్షలతో మార్మోగుతోంది. ఈ నేపథ్యంలోనే తారక్ కో స్టార్, గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ కూడా తారక్​కు బర్త్ డే విషెస్ చెప్పారు. అయితే హృతిక్ కాస్త క్రేజీ గా ఎన్టీఆర్​కు విష్ చేయడంతో ఈ బీ టౌన్ హీరో చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

” హ్యాపీ బర్త్ డే తారక్. ఈ ఏడాది నీకు ఆనందంగా, యాక్షన్​గా ఉండాలని నేను కోరుకుంటున్నాను. యుద్ధభూమిలో నిన్ను కలవడానికి వెయిట్ చేస్తున్నాను. నేను కలిసే వరకు నీ రోజులన్నీ ప్రశాంతంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. పుట్టిన రోజు శుభాకాంక్షలు మిత్రమా” అంటూ ట్వీట్​ చేశారు. దీంతో ఆయన కచ్చితంగా వార్​ సినిమా గురించే ఇందులో ప్రస్థావించారని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news