టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీకి మంచి గుర్తింపు ఉంది. అయితే ఆ కుటుంబం నుంచి వచ్చిన మంచు మనోజ్ అంటే ప్రతి ఒక్కరికి విపరీతమైన అభిమానం ..అంతేకాదు ఆయన కూడా అందరితో కలగలసిపోయి భేద భావాలు లేకుండా సంతోషంగా గడుపుతూ ఉంటాడు. ముఖ్యంగా పేద ధనిక అనే తేడా ఆయన ఎప్పుడూ చూపించరు. అంతేకాదు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే హీరోలు అందరితో కూడా కలిసిమెలసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు మంచు మనోజ్..
ఇదిలా ఉండగా తాజాగా ఆయన నిన్న తన పుట్టినరోజును నిరాడంబరంగా అనాధాశ్రమంలో జరుపుకోవడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ సందర్భంగా హైదరాబాదులోని గాజులరామారం లో ఉన్న కేర్ అండ్ లవ్ అనాధ శరణాలయానికి వెళ్లిన మంచు మనోజ్ అక్కడ చిన్నారులతో కలిసి తన బర్తడే ను సెలబ్రేట్ చేసుకున్నారు. పిల్లలతో సరదాగా కాసేపు మాట్లాడి వారి బాగోగుల గురించి తెలుసుకున్న అనంతరం వారికి నోటు పుస్తకాలు, బ్యాగులు, బొమ్మలు, స్వీట్లు పంపిణీ చేశారు మనోజ్.
అనంతరం మీడియాతో మాట్లాడిన మంచు మనోజ్.. పిల్లల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి.. భవిష్యత్తులో పిల్లలకు నా వంతు సహాయం అందిస్తాను.. వారి కళ్ళల్లో ఆనందం చూస్తుంటే నాకు ఎంతో బలం వచ్చినట్లు ఉంది.. అంటూ చెప్పుకొచ్చారు ఇకపోతే అనాధ ఆశ్రమంలో తన పుట్టినరోజును మంచు మనోజ్ జరుపుకోవడం చూసి ఆయనపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆయన గొప్ప మనసుకు ఇదే నిదర్శనం అంటూ ప్రశంసలు కురిపిస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే తాజాగా మంచు మనోజ్ నటిస్తున్న చిత్రం వాట్ ది ఫిష్.. చిత్ర మేకర్ ఈ సినిమా గ్లింపును కూడా విడుదల చేశారు. ఈ సినిమా డ్రగ్స్ వంటి అంశాలపై తెరకెక్కపోతోందని సమాచారం. ఇకపోతే ఈ సినిమాతో మంచు మనోజ్ ఈసారి పక్కా హిట్ కొట్టేలా కనిపిస్తున్నారు.
Rocking Star @HeroManoj1 celebrated his birthday at Care and Love orphanage, GajulaRamaram with the little superheroes! 🎂🎈
The smiles and laughter shared were pure magic. 💖#HBDManojManchu #RockingStarManoj #ManojManchu pic.twitter.com/Rxac98ZomL
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) May 20, 2023