ఫ్యాక్ట్ చెక్: బ్యాంకులు ఇది కనిపెట్టలేరంటూ ప్రచారం.. నిజం ఏమిటి..?

-

సోషల్ మీడియా లో అనేక వార్తలు మనకి కనబడుతూ ఉంటాయి. ఏది నకిలీ ఈ వార్త ఏది నిజమైన వార్త అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈరోజుల్లో చాలా నకిలీ వార్తలు మనకి కనబడుతున్నాయి ఇది ఇలా ఉంటే తాజాగా ఒక వార్త సోషల్ మీడియా లో షికార్లు కొడుతోంది. మరి అది నిజమా కాదా అందులో నిజం ఎంత అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం…

ఇక సోషల్ మీడియాలో కనపడే వార్త గురించి చూస్తే… బ్యాంకులు సంవత్సరానికి 7 లక్షల రూపాయలు కంటే ఎక్కువ ఖర్చు చేశారా లేదా అనేది బ్యాంకులు కనిపెట్టలేరని ఆ వార్త లో ఉంది. ఇక అసలు విషయానికి వెళ్తే… ఫారిన్ ట్రాన్సాక్షన్ టాక్స్ కి సంబంధించి 7 లక్షల రూపాయలని లిమిట్ గా పెట్టిన విషయం తెలిసిందే. అయితే సోషల్ మీడియాలో చూసినట్లయితే ఏడు లక్షల కంటే ఎక్కువ డబ్బులని ఖర్చు చేశారా లేదా అనేది బ్యాంకులు కనిపెట్టలేవని వార్త వచ్చింది.

అయితే మరి ఇది నిజమా కాదా అనేది చూస్తే… ఇది వట్టి నకిలీ వార్త అని తెలుస్తోంది. ఆర్బీఐ ప్రకారం ఈ విధంగా ఉంది. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కూడా ఈ విషయంపై స్పందించింది ఇది వట్టి నకిలీ వార్త అని తేల్చి చెప్పేసింది ఇటువంటి నకిలీ వార్తలని చూసి అనవసరంగా మోసపోకండి ఈ రోజుల్లో స్కీములకు సంబంధించి ఉద్యోగాలకు సంబంధించి ఎన్నో నకిలీ వార్తలు కనపడుతున్నాయి ఇటువంటి నకిలీ వార్తల్ని కనుక నమ్మరంటే మోసపోవాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news