హైదరాబాద్‌ని మళ్లీ వరుణుడు చుట్టుముట్టేలా ఉన్నాడు. ఇప్పటికే ఆదివారం నగరంలోని పలు ప్రాంతాలలో వర్షం కురిసింది. మరోవైపు వర్షం పడుతుండగానే ఎండతో కూడిన వింత వాతావరణం చోటు చేసుకుంది. ఆదివారం బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, అమీర్ పేట్ సహా పాటు పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఇదిలా ఉండగానే ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఇక ఇప్పటికే కురిసిన అకాల వర్షాలకు అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట కళ్ల ముందే వర్షార్పణం అయిపోతుంటే అన్నదాతలు కంట నీరు ఆగడం లేదు. భారీగా వర్షపు నీరు చేరడంతో లోతట్టు ప్రాంతాలు జలశయాలను తలపిస్తున్నాయి. ఉదయం నుంచి ఎండవేడిమికి నగరవాసులు అల్లాడిపోయారు. సాయంత్రం ఇలా ఒక్కసారిగా వర్షం కురుస్తుండండతో వారికి కాస్త ఉపశమనం లభించినట్టు అయింది.