రాష్ట్రంలో ఎండల తీవ్రతతో పాటుగా బీర్ల విక్రయాలు కూడా రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. 2023 మే 1 నుంచి 18 మధ్య రాష్ట్రంలో 4.23 కోట్ల బీర్ సీసాలు అమ్ముడయ్యాయి. మే చివరి నాటికి బీర్ల విక్రయం రూ.1000 కోట్లు దాటుతుందని ఎక్సైజ్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..మే నెల ప్రారంభం నుంచి మే 18 తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 19 డిపోల ద్వారా 35 లక్షల 25వేల 247 కాటన్‌ల బీర్ బాటిళ్లు అమ్ముడయ్యాయి. ఈ 18 రోజుల్లో బీర్ల విక్రయాల్లో నల్గొండ జిల్లా అగ్రస్థానంలో ఉండగా, కరీంనగర్ జిల్లా రెండో స్థానంలో నిలిచింది. నల్గొండ జిల్లాలో రూ.48.14 కోట్ల విలువైన 3 లక్షల 364 కాటన్‌ల బీర్ల విక్రయాలు జరిగడం గమనార్హం.
మొత్తం 35,25,247 కాటన్లు బీర్లు అమ్ముడైనట్లు డేటా చెబుతోంది. ఈ లెక్కన మే నెల ముగిసే సమయానికి ప్రభుత్వ ఖజానాకు కేవలం బీర్ల అమ్మకాలతోనే రూ.1000 కోట్లు ఆదాయం వచ్చే అవకాశం లేకపోలేదు. బీర్ సేల్స్ లో రాష్ట్రంలో నల్గొండ జిల్లా టాప్ లో ఉంది. నల్గొండలో రూ.48.14 కోట్ల విలువైన బీర్లు తాగేశారు. ఆ తర్వాతి స్థానంలో కరీంనగర్ జిల్లా ఉంది. ముదిరిన ఎండలకు తోడు.. పెళ్లిళ్ల సీజన్ కావడంతో లిక్కర్ సేల్స్ పెరిగాయంటున్నారు ఎక్సైజ్ అధికారులు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉండటంతో.. లిక్కర్ విక్రయాలు మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.