ఆందోళనకరంగా ఎంపీ అవినాష్‌ రెడ్డి తల్లి ఆరోగ్యం .. ప్రెస్‌ నోట్‌ రిలీజ్‌ చేసిన ఆస్పత్రి

-

కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి తల్లి శ్రీలక్ష్మి ఆరోగ్య పరిస్థితిపై విశ్వభారతి ఆస్పత్రి తాజాగా ఓ ప్రెస్ నోట్ విడుదల చేసింది. శ్రీలక్ష్మీ ఆరోగ్యం ప్రస్తుతం ఆందోళనకరంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. గత నాలుగు రోజులుగా కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు. గుండెకు సంబంధించిన ఇబ్బందులకు గాను ఆమెకు చికిత్స అందిస్తున్నారు. సీబీఐ విచారణకు హాజరుకావాల్సి ఉన్నప్పటికీ.. అవినాష్‌ రెడ్డి కూడా తల్లితో ఆస్పత్రిలోనే ఉంటున్నారు.

‘‘అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఆమె నాన్‌ఎస్‌టీ ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫెక్షన్‌ (హార్ట్ అటాక్)కు గురయ్యారు. యాంజియోగ్రామ్ చేశాక.. ఆమె డబుల్ నాళాల వ్యాధితో బాధపడుతున్నట్లు తేలింది. ప్రస్తుతం సీసీయూలో ఉన్న ఆమెను ఒక ప్రత్యేక వైద్యుల బృందం పర్యవేక్షిస్తోంది. రక్తపోటు ఇప్పటికీ తక్కువగా ఉంది. ఆమె అయానోట్రోపిక్ సపోర్ట్‌పై ఉన్నారు. ప్రస్తుతం ఆమెకు వాంతులు అవుతున్నాయి. వాంతులు  ఇలాగే కొనసాగితే ఆల్ట్రాసౌండ్ స్కాన్‌, మెదడుకు ఇమేజింగ్ స్కాన్‌ చేసేందుకు ఏర్పాట్లు చేశాం. ఆమెకు లోబీపీ ఉన్నందున మరికొన్ని రోజులు సీసీయూలో ఉంచాల్సిన అవసరం ఉంది’’ అని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

Read more RELATED
Recommended to you

Latest news