గత రాత్రి బెంగుళూరు లోని చిన్నస్వామి స్టేడియం లో జరిగిన కీలక మ్యాచ్ లో గెలవాల్సిన అవసరం ఉన్నప్పటికీ ఓటమి పాలయ్యి ప్లే ఆఫ్ కు చేరకుండానే ఈ సంవత్సరం కూడా ఇంటి దారి పట్టింది. టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేసిన బెంగుళూరు నిర్ణీత ఓవర్ లలో 197 పరుగులు చేయగలిగింది. విరాట్ కోహ్లీ ఒక్కడే ఒంటరిగా పోరాడి వరుసగా సీజన్ లో రెండవ సెంచరీ తో ఆ మాత్రం స్కోర్ ను ఇవ్వగలిగాడు. అనంతరం లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ సింగిల్ సైడ్ గేమ్ లాగా మరో అయిదు బంతులు మిగిలి ఉండగానే సునాయాసంగా ఛేదించి బెంగుళూరు ను ఇంటికి పంపించింది. ఈ మ్యాచ్ కు విచ్చేసిన కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఎన్నికల కారణంగా టెన్షన్ టెన్షన్ గా గడిపిన ఇన్ని రోజుల తర్వాత సరదాగా హోమ్ టీం ను సపోర్ట్ చేయడానికి స్టేడియానికి వచ్చాడు.
RCB ఓడిపోయి ఉండవచ్చు కానీ.. మా కర్ణాటక మనసులను గెలుచుకుందని మరియు త్వరలోనే మనము ట్రోపీని గెలుచుకునే సమయం వస్తుందని ఆశాభావాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేశాడు.