ఒకేరోజు 1061 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం: హరీశ్‌రావు

-

రాష్ట్ర వైద్య శాఖలో అత్యంత పారదర్శకంగా నియామకాలు చేస్తున్నామని ఆ శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. రాష్ట్రంలో వైద్యారోగ్య వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నూతన మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తోందని మంత్రి హరీశ్ రావు అన్నారు. కొత్తగా నియామకమైన వేయి 61మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు హైదరాబాద్ లో నియామక పత్రాలను అందించారు. పెరిగిన ఆస్పత్రులకు అనుగుణంగా నియామకాలు చేస్తున్నామని వెల్లడించారు. ఒకే రోజు 1061 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించామని చెప్పారు. వైద్య విద్యలో దేశంలోనే ఇది ఒక రికార్డు అని మంత్రి హరీశ్ రావు వివరించారు.

“80 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టాం. 1,331 మంది ఆయుష్ కాంట్రాక్టు సిబ్బందిని క్రమబద్ధీకరించాం. 2014 నుంచి ఆరోగ్యశాఖలో 22,263 మంది నియామకం. ఆరోగ్యశాఖలో మరో 2 నెలల్లో మరో 9,222 పోస్టులు భర్తీ. ప్రభుత్వ వైద్య సేవల్లో మూడో స్థానంలో ఉన్నాం.” – హరీశ్ రావు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి

 

Read more RELATED
Recommended to you

Latest news