ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం భారీ ఊరట కల్పించింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన 2014-15 నాటి రెవెన్యూ లోటు కింద రూ.10, 461 కోట్లను విడుదల చేసింది. ప్రత్యేక సాధారణ ఆర్థిక సాయం కింద ఈ మొత్తాన్ని మంజూరు చేసింది. రెవెన్యూ లోటు విషయంపై సీఎం జగన్ తో పాటు ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు కేంద్రంతో పలు దఫాలుగా చేసిన చర్చలు ఫలించడంతో ఒకేసారి పెద్ద మొత్తంలో నిధులు విడుదలయ్యాయి.
ఇది ఇలా ఉండగా, ఏపీ ఐసెట్ పరీక్షకు 49, 162 మంది దరఖాస్తులు చేసుకున్నారని అధికారులు తెలిపారు. రేపు ఉదయం 9 నుంచి 11:30 వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 వరకు రెండు సెషన్లలో పరీక్ష జరుగుతుందన్నారు. ఈ మేరకు 11 కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు చెప్పారు. విద్యార్థులు హాల్ టికెట్ తో పాటు ఏదైనా ఒక గుర్తింపు కార్డును తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు. నిమిషం లేట్ అయిన అనుమతి ఉండదని తెలిపారు.