మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన ఖైదీనంబర్ 150 సినిమాకు వివి.వినాయక్ దర్వకత్వం వహించిన సంగతి తెలిసిందే. పదేళ్ల తర్వాత ఈ సినిమాతో వెండితెరపై గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇచ్చిన చిరు మంచి కమర్షియల్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం చిరు నటించిన సైరా నరసింహారెడ్డి థియేటర్లలో ఆడుతోంది. స్వాతంత్య్ర సమరయోధుడు అయిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.
ఇక ఈ సినిమా తర్వాత చిరు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కే సందేశాత్మక చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే షూటింగ్ ప్రారంభోత్సవం జరుపుకున్న ఈ సినిమాలో చిరుతో పాటు మరో హీరోగా చిరు తనయుడు రామ్‌చరణ్ కూడా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇక మరోవైపు చిరు 152వ సినిమాను డైరెక్ట్ చేస్తోన్న కొరటాల శివ చిరును డైరెక్ట్ చేస్తుండడంతో ఈ సినిమాపై సైతం భారీ అంచనాలు ఉన్నాయి.
ఇక ఇప్పుడు ఈ సినిమా సెట్స్‌మీదకు అలా వెళ్లిందో లేదో వెంటనే చిరు 152వ సినిమా గురించి అప్‌డేట్ వచ్చేసింది. ఆ డైరెక్టర్ గురించి కూడా అప్‌డేట్ వచ్చేసింది. అతడే సుకుమార్. ఈ లెక్కల మాస్టార్ ట్యాలెంట్ ఏమిటో రంగస్థలం సినిమాతో సాలిడ్ గా మరోసారి ప్రూవైంది. నాన్ బాహుబలి రికార్డులకు పాతరేసిన ఈ సినిమా తర్వాత చిరు, సుక్కు రేంజ్ పూర్తిగా మారిపోయింది. ఇక చరణ్ చొరవతో చిరు 153వ సినిమా డైరెక్ట్ చేసే ఛాన్స్ సుక్కుకే దక్కింది.
అయితే ఇది రీమేక్ సినిమా అని టాక్? మోహన్ లాల్ హీరోగా మళయాళంలో నటించిన బ్లాక్ బస్టర్ మూవీ `లూసిఫర్`కి రీమేక్ అని ప్రచారం అవుతోంది. మెగాస్టార్ ఇమేజ్ కి తగ్గట్టు.. తెలుగు నేటివిటీకి అనువర్తిస్తూ ఏపీ పొలిటికల్ సిట్యుయేషన్ కి తగ్గట్టుగా కథాంశాన్ని మార్చి తెరకెక్కిస్తారట. ఈ సినిమాను సైతం రామ్‌చరణ్ నిర్మిస్తారని తెలుస్తోంది.