ఈ రోజు చెన్నైలో చెన్నై సూపర్ కింగ్స్ మరియు గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్యన ఐపీఎల్ లో లీగ్ స్టేజ్ తర్వాత జరగనున్న క్వాలిఫైయర్ 1 లో తలపడనున్నాయి. గుజరాత్ మరియు చెన్నై జట్లు లీగ్ స్టేజ్ లో అద్భుతమైన ప్రదర్శన చేసి పాయింట్ల పట్టికలో వరుసగా మొదటి మరియు రెండు స్థానాలలో ఉన్నారు. ఇప్పుడు ఈ రెండు జట్ల మధ్యన జరగనున్న ఈ మ్యాచ్ లో ఎవరు గెలవనున్నారు అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గుజరాత్ జట్టు వరుస విజయాలతో అద్భుతమైన ఫామ్ లో ఉంది, చెన్నై సూపర్ కింగ్స్ కూడా అన్ని విభాగాలలో పటిష్టంగా ఉంది. అందుకే రెండు జట్ల మధ్యన ఈ రోజు మ్యాచ్ హోరా హోరీగా ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు,. ఈ మ్యాచ్ లో ఎవరు గెలిచినా డైరెక్ట్ గా ఫైనల్ కు అర్హత సాధిస్తుంది.
ఒకవేళ ఓడిపోయినా టీం కు మరొక్క అవకాశం ఉంటుంది. ఎలిమినేటర్ లో లక్నో మరియు ముంబై ల మధ్య జరిగే మ్యాచ్ లో గెలిచిన జట్టు ఇక్కడ ఓడిపోయినా జట్టుతో తలపడి ఫైనల్ కు వెళ్లాల్సి ఉంది. మరి మొదటి ఫైనల్ బెర్త్ ను ఎవరు కైవసం చేసుకుంటారో చూడాలి.