ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమం పైన సీఎం జగన్ ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నాడు. కానీ ఈ పాలన వైసీపీ మద్దతు దారులకు మాత్రమే నచ్చుతుండగా , విపక్షాలు అన్నీ అనవసరంగా ప్రజలను సోమరిపోతులను చేస్తున్నాడని విమర్శిస్తున్నారు. అయితే సీఎం జగన్ ఇవేమీ పట్టించుకోకుండా తనకు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ వెళుతున్నాడు. కాగా తాజాగా సీఎం ఆఫీస్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 27 వ తేదీన ఢిల్లీకి పయనం కానున్నాడు. అయితే ఢిల్లీ జరగనున్న నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశానికి హాజరు కానున్నాడు. ఈ సమావేశంలో అందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము సాధిస్తున్న ప్రగతి గురించి వివరించనున్నారు.
అంతే కాకుండా MSME లకు అందిస్తున్న సాయం మరియు మద్దతు గురించి కూడా ఈ మీట్ లో అధికారులతో చర్చించనున్నట్లు సమాచారం అందుతోంది. మరి ఈ పర్యటనలో బీజేపీ అధిష్టానంతో ఏమైనా మీట్ అయ్యే అవకాశం ఉంటుందా అన్నది చూడాలి.