ఏపీ అప్పులపై సీఎం జగన్‌ సంచలన వ్యాఖ్యలు

-

ఏపీ అప్పులపై సీఎం జగన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొవ్వూరు బహిరంగ సభలో సి.ఎం జగన్ మాట్లాడుతూ…ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర అప్పులు గ్రోత్ రేట్ గతంలో కంటే తక్కువ ఉన్నాయని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో జరగనున్న కురుక్షేత్ర మహాసంగ్రామంలో నాకు అండగా ఉండండని.. ఒక్క జగన్ పై తోడేళ్ల అందరూ కలిసి వస్తున్నారని వివరించారు.

మీ ఇంట్లో మేలు జరిగిందనే కొలమానంతో నాకు మద్దతు ఇవ్వండని.. మీరు చదవండి ఎంత ఫీజు అయితే అంత చెల్లిస్తామని ప్రకటించారు.విద్యార్థులపై చేస్తున్న ఖర్చు హ్యూమన్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అని.. ఈ విషయాన్ని జ్ఞానం లేని ప్రతిపక్షాలు గ్రహించాలని కోరారు. జూన్ నుంచి 15,750 స్కూళ్లలో డిజిటల్ విద్యా బోధన ప్రారంభిస్తున్నామని చెప్పుకొచ్చారు.

ఒక సత్య నాదెళ్ల గురించి మాట్లాడటం కాదు.. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రతి ఇంట్లో ఒక సత్య నాదెళ్ల రావాలని కోరారు. అందుకే విదేశీ విద్యకు ఒక్కో విద్యార్థికి 1 కోటి‌ 25 లక్షల రూపాయలు అన్నారు సీఎం జగన్‌. నాలుగేళ్లలో మూడు లక్షల కోట్ల రూపాయలు అక్క చెల్లెమ్మలకు మేలు జరిగింది.. గతంలో ఏ ముఖ్యమంత్రి పేదల గురించి ఇలా ఆలోచించ లేదని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news