ములుగులో పిచ్చి కుక్కల స్వైర విహారం.. ఏడుగురిపై దాడి

-

ఇటీవల కాలంలో మనుషులపై కుక్కల దాడులు పెరిగిపోతూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న కుక్కల దాడిలో చిన్న బాలుడు
మృతి చెందిన విషాద ఘటన మరువకముందే బుధవారం ములుగు జిల్లాలోని గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామంలో ఒక పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. చల్వాయి గ్రామంలో బుధవారం ఉదయం పిచ్చికుక్క ఒక్కసారిగా మనుషులపై దాడి చేయడంతో చల్వాయి గ్రామానికి చెందిన ఏడుగురు గాయాల పాలయ్యారు.

Delhi Stray Dog Attack: 14-year-old boy attacked by stray dogs in southwest  Delhi | Delhi News - Times of India

గాయపడిన వారిలో ఇద్దరికీ తీవ్ర గాయాలవగా, మిగతా వారికి స్వల్ప గాయాలయ్యాయి. పిచ్చికుక్క దాడిలో గాయపడిన వారందరినీ స్థానికులు ములుగు జిల్లా కేంద్రంలోని ఏరియా హాస్పిటల్ కి తరలించగా వారికి డాక్టర్లు వైద్యం చేస్తున్నారు. గాయపడిన వారందరికీ ఆరోగ్యం నిలకడగానే ఉందని డాక్టర్లు తెలియజేశారు. ఇలా కుక్కల దాడిలో ఏడుగురికి గాయమవడంతో తమ ప్రాంతంలో కుక్కల బెడద లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు అధికారులను కోరుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news