ఆ దర్శకుడు నా అండర్ వేర్ చూడాలని ఉందన్నాడు : ప్రియాంకా చోప్రా

-

సినీ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులు గత కొన్ని రోజులుగా బయటపడుతున్నాయి. అంతర్జాతీయ తారగా పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న నటి ప్రియాంక చోప్రా తన కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న ఓ చేదు అనుభవాన్ని మీడియాతో పంచుకుంది. ఓ సినిమా కోసం సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న సమయంలో దర్శకుడు నా అండర్ వేర్ చూడాలని ఉందని చెప్పాడు అని వెల్లడించింది. ఏ సందర్భంలో అతడు ఆ మాట అన్నాడో కూడా ప్రియాంక చోప్రా వివరించింది.

Why did Priyanka Chopra burn a lot of her high school pictures? Here's what  the actress has to say | PINKVILLA

“ఇది 2002-03 నాటి ఘటన. ఆ సినిమాలో నేను ఒక అండర్ కవర్ ఏజెంట్ ని. శృంగారపరంగా ఓ వ్యక్తిని రెచ్చగొట్టేలా నటించాలి. ఆ సీన్ లో నేను శరీరంపై కొద్ది మేర దుస్తులు తొలగించాల్సి ఉంటుంది. అప్పుడు ఆ డైరెక్టర్ వచ్చి… నో… నేను ఆమె అండర్ వేర్ చూడాలని అనుకుంటున్నాను… ఇలాంటివి లేకపోతే ఈ సినిమా చూడ్డానికి ఎవరొస్తారు? అన్నాడు. దాంతో దిగ్భ్రాంతికి గురయ్యాను. నా కెరీర్ లో ఇదొక అమానవీయ ఘటన” అంటూ ప్రియాంక చోప్రా వివరించింది. ప్రియాంక చోప్రా ఇటీవల సిటాడెల్ అనే వెబ్ సిరీస్ లో నటించింది. గత నెలలో ఓటీటీ వేదికపై ఇచ్చిన ఈ యాక్షన్ అడ్వెంచర్ వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news