ఏపీ ప్రజలకు అలర్ట్.. నేడు ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు,ఇబ్రహీంపట్నం, జగ్గయ్యపేట, కంచికచర్ల,నందిగామ, పెనుగంచిప్రోలు మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. గుంటూరు జిల్లా గుంటూరు, దుగ్గిరాల, మంగళగిరి, మేడికొండూరు, పెదకాకాని,తాడేపల్లి, తాడికొండ,తుళ్లూరు మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
పల్నాడు జిల్లా అమరావతి, అచ్చంపేట,పెదకూరపాడు మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది.
మిగిలిన చోట్ల ఎండ ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ప్రయాణాల్లో ఉన్నవారు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని.. నిన్న శ్రీకాకుళం జిల్లా కొత్తూరులో 44.8°C, పల్నాడు జిల్లా మాచర్లలో 44.7°C అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.