కర్ణాటకలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సారథ్యంలోని అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే 8 మంది తో మంత్రివర్గ విస్తరణ చేపట్టింది.
అలాగే కొత్త మంత్రుల పేర్లతో కూడిన జాబితాపై పార్టీ అధిష్ఠానం ఆమోదం తెలిపింది. ఇక 24 మంది శాసన సభ్యులు- ఇవ్వాళ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ రోజు ఉదయం 11:45 నిమిషాలకు రాజ్‌భవన్‌లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ వారితో ప్రమాణ స్వీకారం చేయిస్తారు.