రేపు ఎన్నికల ఫేజ్-1 మేనిఫెస్టో ప్రకటిస్తాం – చంద్రబాబు

-

రేపు ఎన్నికల ఫేజ్-1 మేనిఫెస్టో ప్రకటిస్తామని ప్రకటించారు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా సైకిల్ సిద్ధంగా ఉందని వెల్లడించారు చంద్రబాబు. ఇవాళ ప్రారంభమైన టీడీపీ మహానాడు కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొని, మాట్లాడారు.

జరిగేది కురుక్షేత్రం.. అజాగ్రత్త వద్దు.. పేదల సంక్షేమానికి.. రాష్ట్రాభివృద్ధికి ఏం చేయాలో టీడీపీకి తెలుసు.. సంపద సృష్టిస్తాం.. పేదలకు పంచుతాం.. పేదవాడు ధనికుడు కావడమే నా ఆశయం అన్నారు చంద్రబాబు.

అటు రానున్న ఎన్నికల్లో 160 స్థానాల్లో గెలుస్తామన్నారు టిడిపి ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు. రాజమండ్రి మహానాడులో టిడిపి ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ….. రానున్న ఎన్నికల్లో 160 స్థానాల్లో గెలిచి టిడిపి అధికారంలోకి రావడం ఖాయం… కార్యకర్తలు ఇందు కోసం కష్టించి పని చేయాలని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news