ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏనాడు కూడా జగన్ మోహన్ రెడ్డి గారు కోర్టుకు ఏనాడు హాజరు కాలేదని, కోడి కత్తితో తనపై హత్యా ప్రయత్నం జరిగినట్లు పేర్కొని ఆ కేసు తుది విచారణకు తన ఇంటికి కూత వేటు దూరంలో ఉన్న ఎన్ఐఏ కోర్టు కూడా జగన్ మోహన్ రెడ్డి గారు హాజరుకావడానికి ఇష్టపడలేదని అన్నారు ఎంపీ రఘురామ. వివేకానంద రెడ్డి గారి హత్య కేసు విచారణకు ఆయన సహకరిస్తారన్న నమ్మకం ఎవరికి లేదని, ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో కేసును విచారించాలని రఘురామకృష్ణ రాజు గారు కోరారు.
ఇంటర్నెట్ ప్రోటోకాల్ డిజిటల్ రికార్డర్ (ఐపిడిఆర్) ఆధారంగా ఫోన్ కాల్ ద్వారా ఏమి మాట్లాడారో తెలియకపోయినప్పటికీ, ఒకే సమయంలో అవినాష్ రెడ్డి గారి ఫోన్, జగన్ మోహన్ రెడ్డి గారు, లేదంటే భారతీ రెడ్డి గారు ఫోన్లు ఆన్ లో ఉన్నట్టు, ఒకే సమయంలో కట్ అయినట్లు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సీబీఐ గుర్తించిందని, వివేకానంద రెడ్డి గారి హత్యకు ముందు , హత్య అనంతరం ఐపిడిఆర్ ద్వారా ఒకే సమయంలో ఎవరెవరి ఫోన్లు ఆన్ లో ఉన్నాయో తెలిస్తే ఈ హత్య కేసు కు ఒక ఆధారం దొరికినట్లేనని అన్నారు.
ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం పట్ల అవినాష్ రెడ్డి గారి తరఫున న్యాయవాది కంగారుపడి, అభ్యంతరం చెప్పడం విడ్డూరంగా ఉందని, సీబీఐ తుది చార్జి షీట్ దాఖలు చేసిన అనంతరం, కోర్టులో ట్రయల్స్ జరిగేటప్పుడు అభ్యంతరం చెబితే అర్థం ఉంది కానీ… ఇప్పుడు అభ్యంతరం చెప్పడం సరికాదని, సీబీఐ సాంకేతికంగా ఎప్పటికప్పుడు అప్ గ్రేడ్ అవుతూనే ఉందని అన్నారు. ఛార్జ్ షీట్ దాఖలు చేయకముందే విచారణలో హైకోర్టు జోక్యం చేసుకునే అవకాశం లేదని, విచారణ అధికారి ఎలా విచారణ చేయాలన్నది ఆయన ఇష్టం అని, విచారణలో జోక్యం చేసుకునే అధికారం న్యాయస్థానానికి లేదని, విచారణ ఎలా చేశారని ప్రశ్నించడం కూడా సబబు కాదన్నది నా భావన అని రఘురామకృష్ణ రాజు గారు పేర్కొన్నారు.