ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్ 1 షెడ్యూల్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ 1 మెయిన్ పరీక్షల కోసం నోటిఫికేషన్ ప్రక్రియ పూర్తి అయింది. APPSC చైర్మన్ గౌతమ్ సవాంగ్ తెలిపిన సమాచారం ప్రకారం ఈ పరీక్షల షెడ్యూల్ 3 జూన్ నుండి 10 జూన్ వరకు జరగనున్నాయని తెలియచేశారు. అదే విధంగా ఈ పరీక్షలను ఉదయం 10 .30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు సమయం ఉండనుంది. ఇక ఈ పరీక్ష రాయాల్సిన అభ్యర్థులు ఎటువంటి పరిస్థితిలో ఉదయం 9 .45 గంటలకు హాల్ లోకి హాజరు కావాలని చెప్పారు. ఆ పైన నిముషము ఆలస్యం అయినా ఎంటర్ చేయబోమని స్పష్టంగా చెప్పారు.
ఇక ఈ పరీక్ష ఫలితాలను జులై లో విడుదల చేయనున్నామని సవాంగ్ తెలిపారు. దీనితో ఈ పరీక్షకు అప్లై చేసిన అభ్యర్థులు వెంటనే తగిన ఏర్పాట్లు చేసుకోవలెనని తెలిపారు.