పెళ్లి చేసుకోబోతున్న దసరా మూవీ డైరెక్టర్..!!

-

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యులు ఈ మధ్యకాలంలో వరుస సినిమాలను తెరకెక్కిస్తే మంచి విజయాలను అందుకుంటున్నారు. సుకుమార్ శిష్యుడిగా పేరుపొందిన శ్రీకాంత్ ఓదెల డైరెక్టర్గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమయ్యారు. తన మొదటి చిత్రం దసరా తోనే బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నారు.. నాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన ఈ చిత్రం విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షాన్ని కురిపించింది.

ప్రస్తుతం డైరెక్టర్ శ్రీకాంత్ ఓదేల తదుపరిచిత్రం ఎవరితో అనే విషయంపై ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి. మళ్లీ ఎలాంటి ప్రాజెక్టుతో ప్రేక్షకులను అలరిస్తారో అంటూ అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే శ్రీకాంత్ ఓదేల కు సంబంధించి తాజాగా ఒక విషయం వైరల్ గా మారుతోంది..అదేమిటంటే ఆయన పెళ్లి గురించి పలు వార్తలు వినిపిస్తున్నాయి త్వరలోనే ఈ డైరెక్టర్ ఒక ఇంటి వాడు కాబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం శ్రీకాంత్ ఓదెల పుష్ప -2 చిత్ర షూటింగ్ కు సహకరిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజా షెడ్యూల్ను ముగించడంతో నేరుగా తన సొంత జిల్లా అయిన కరీంనగర్ కు బయలుదేరి వెళ్లినట్లు సమాచారం. ఇక పెళ్లి కూడా అక్కడే కరీంనగర్లో జరగబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన చేసుకోబోయే అమ్మాయి గురించి ఎలాంటి విషయాలు మాత్రం ఇంకా తెలియడం లేదు.

డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తన వివాహాన్ని చాలా సింపుల్ గా సన్నిహిత, కుటుంబ సమక్షంలోనే వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాట్లు తెలుస్తోంది. శ్రీకాంత్ ఓదెల గురువు సుకుమార్, డైరెక్టర్ బుచ్చిబాబు రాబోతున్నట్లు సమాచారం.. అలాగే దసరా టీం కూడా హాజరవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంపై క్లారిటీ ఇస్తారేమో చూడాలి మరి.

Read more RELATED
Recommended to you

Latest news