వైరల్‌ వీడియో: భార్యకు అందాల పోటీల్లో అన్యాయం జరిగిందని కిరీటాన్ని ముక్కలు చేసిన భర్త

-

వైరల్‌ వీడియో: కొన్నిసార్లు భలే గమ్మత్తైన ఘటనలు జరుగుతాయి కదా..! కోపం వచ్చినప్పుడు మనిషి ఏదైనా చేసేస్తాడు.. అది వారి నైజం అంతే. అందాల పోటీలో తన భార్య రన్నరప్‌గా నిలవడం తట్టుకోలేని ఓ వ్యక్తి.. స్టేజీపైకి వెళ్లి కిరీటాన్ని ధ్వంసం చేశాడు.. ఈ ఘటన బ్రెజిల్‌లో జరిగింది. చుట్టూ అంత మంది జనం ఉన్నా కూడా ఆ వ్యక్తి తన కోపాన్ని అదుపుచేసుకోలేకపోయాడు. భార్యకు అన్యాయం జరిగిందన్న అక్కసుతో కిరీటాన్ని ఇలా ముక్కలు ముక్కలు చేశాడు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది.

బ్రెజిల్‌లో ఓ అందాల పోటీ తుది దశకు చేరుకుంది. చివరకు స్టేజీపై ఇద్దరే మిగిలారు. ఈ క్రమంలోనే ఉత్కంఠకు తెరదించుతూ విజేతను ప్రకటించారు. ఓ మహిళ.. కొత్త విజేతకు కిరీటం అలంకరించేందుకు ముందుకొచ్చారు. అంతలోనే ఓ వ్యక్తి ఒక్కసారిగా స్టేజీపైకి దూసుకొచ్చి ఆ కిరీటాన్ని లాక్కొని, నేలకేసి విసిరికొట్టాడు. అదీ రెండుసార్లు. దీంతో అక్కడున్న వారంతా షాక్‌ అయ్యారు. దీనికి కారణం.. అతని భార్య రెండో స్థానానికి పరిమితం కావడమే. బ్రెజిల్‌ ()లో ఇటీవల నిర్వహించిన ‘మిస్‌ గే మాటో గ్రాసో- 2023 (Miss Gay Mato Grosso 2023)’ అందాల పోటీలో సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది.

ఈ పోటీల్లో నథాలీ బెకర్‌, ఇమాన్యుయెల్‌ బెలీని ఫైనల్‌కు చేరుకున్నారు. చివరకు బెలీని విజేతగా నిలిచారు. దీంతో ఆమెకు కిరీటాన్ని అలంకరించే లోపే.. బెకర్‌ భర్త స్టేజీపైకి దూసుకొచ్చాడు. ఆగ్రహంతో కిరీటాన్ని లాక్కొని, రెండుసార్లు నేలపైకి విసిరికొట్టాడు. దీంతో అది కాస్త ముక్కలు ముక్కలైంది. అంతటితో ఆగకుండా అక్కడున్న వారిపై అరుస్తూ తన భార్యను పక్కకు లాక్కెళ్లాడు. అక్కడున్న భద్రతా సిబ్బంది జోక్యం చేసుకుని, అతన్ని పక్కకు తీసుకెళ్లారు. మరోవైపు.. నిర్వాహకులు ఈ ఘటనను ఖండించారు. ఫలితం విషయంలో తన భార్యకు అన్యాయం జరిగిందని అతను భావించాడని, కానీ న్యాయనిర్ణేతలు సరైన నిర్ణయమే తీసుకున్నారని వారు చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా ఇలా చేయడం మాత్రం ఆశ్చర్యకరమైన విషయమే.

Read more RELATED
Recommended to you

Latest news