సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ దూసుకుపోతోంది – వైసీపీ ఎంపీ

-

సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ దూసుకుపోతోందని పేర్కొన్నారు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణ రాజు. ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన అనంతరం తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతోందని, గత ప్రభుత్వ హయాంలో తెలంగాణ కంటే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఆదాయంలో, అభివృద్ధిలో ముందంజలో ఉండగా, గత నాలుగేళ్లలో వెనుకంజ వేసిందని చెప్పారు.

తెలంగాణలో అభివృద్ధి జరిగి ఆదాయం పెరిగిందని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే నష్టపోతుందని భావించి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు సరికాదని గతంలో న్యాయస్థానంలో అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగిందని రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో రాష్ట్రం ప్రగతి పదంలో నడుస్తుండడం అభినందనీయమని అన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news