ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం.. బాధితుల్లో ఆ రాష్ట్రం వారే ఎక్కువ

-

ఒడిశాలోని బాలేశ్వర్ సమీపంలోని బహానగాబజార్ వద్ద మరణ మృదంగం మోగింది. రెండు సూపర్‌ ఫాస్ట్‌ రైళ్లు, ఓ గూడ్స్‌ రైలు ఢీ కొట్టడంతో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 233 మంది దుర్మరణం పాలయ్యారు. 900 మందికిపైగా గాయాలపాలయ్యారు. బెంగళూరు నుంచి పశ్చిమ బెంగాల్‌లోని హావ్‌డాకు వెళ్తున్న బెంగళూరు-హావ్‌డా సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ బాలేశ్వర్‌ సమీపంలోని బహానగాబజార్‌ వద్ద శుక్రవారం రాత్రి 7గంటల సమయంలో పట్టాలు తప్పింది. పలు బోగీలు పక్కనున్న ట్రాక్‌పై పడ్డాయి. వాటిని షాలిమార్‌-చెన్నై సెంట్రల్‌ కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఢీకొట్టింది.

ఈ ఘటనతో కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 15బోగీలు బోల్తాపడ్డాయి. ఈ ప్రమాదం అక్కడితోనే ఆగలేదు. బోల్తాపడ్డ కోరమండల్‌ కోచ్‌లను పక్కనే ఉన్న మరో ట్రాక్‌పై నుంచి దూసుకొచ్చిన గూడ్సు రైలు ఢీకొంది. 3రైళ్లు ఢీకొనడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. అయితే ఈ రైల్లో ప్రయాణిస్తున్న వారిలో పశ్చిమ బెంగాల్​కు చెందిన ప్రయాణికులే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. మృతుల్లో కూడా వారి సంఖ్యే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ రైళ్లలో ఏపీలోని విజయవాడకు చెందిన వారు కూడా ప్రయాణిస్తున్నట్లు తెలిసింది.

Read more RELATED
Recommended to you

Latest news