ఒడిస్సా రైలు ప్రమాదం.. 278 కి చేరిన మృతుల సంఖ్య

-

ఒడిశా రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య భారీగా పెరుగుతుండటం ఆందోళనకు గురిచేస్తుంది. ఇప్పటివరకు 278 మంది మరణించారని అధికారులు వెల్లడించారు. గాయపడిన 900 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. 7NDRF, 5ODRF, 24 ఫైర్ సర్వీస్ యూనిట్స్, లోకల్ పోలీసులు, వాలంటీర్లు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.

ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇవాళ బీజేపీ నిర్వహిస్తున్న కార్యక్రమాలు రద్దు చేస్తున్నట్లు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కీలక ప్రకటన చేశారు. బిజెపి ప్రభుత్వం ఏర్పడి నేటికీ 9ఏళ్లు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే దేశంలోని అన్ని రాష్ట్రాలలో ఉత్సవ వేడుకలు నిర్వహించాలని బిజెపి అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అయితే ఒరిస్సా రైలు ప్రమాదం తరుణంలో ఆ వేడుకలను రద్దు చేయాలని జేపీ నడ్డా పిలుపునిచ్చారు. అలాగే మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు జేపీ నడ్డా.

Read more RELATED
Recommended to you

Latest news