ఒడిశా బాలేశ్వర్ జిల్లాలో శుక్రవారం రాత్రి ఘోర రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఈ ఘటనలో 278 మంది మరణించారు. మరో 900 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలిలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఈ మహా విషాదంపై రాజకీయ, సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధితులకు పరిహారం ప్రకటించాయి. ఈ తరుణంలోనే.. ప్రధాని మోడీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాసేపట్లో రైలు ప్రమాదస్థలికి ప్రధాని మోడీ వెళ్లనున్నారు. ప్రమాద స్థలాన్ని పర్యవేక్షించనున్న ప్రధాని.. కటక్ ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించనున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.