ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ముగ్గురు ఏపీ ప్రయాణికులు కనిపించకుండా పోయారు. రాజమహేంద్రవరం వచ్చేందుకు కోరమండల్ ఎక్స్‌ప్రెస్ లో 24 మంది తెలుగువారు ఎక్కినట్లు తెలుస్తోంది. వీరిలో 21 మంది సురక్షితంగా ఉన్నారు. మరో ముగ్గురి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు రైళ్ల రద్దుతో రాజమహేంద్రవరంలో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు.
కాగా, ఒడిశా రైలు ప్రమాద ఘటనపై సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.. ఘటనా స్థలానికి మంత్రి అమర్నాథ్ నేతృత్వంలో ముగ్గురు ఐఏఎస్‌ల బృందం వెళ్లనుంది. జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో ఎంక్వైరీ విభాగాలు ఏర్పాటు చేశారు. అవసరమైన పక్షంలో ఘటనాస్థలానికి పంపించడానికి అంబులెన్స్‌లు సన్నద్ధం చేయనున్నారు సీఎం జగన్. ఎమర్జెన్సీ సేవల కోసం విశాఖ సహా ఒడిశా సరిహద్దు జిల్లాల్లో ఆస్పత్రులు అలర్ట్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.