రోజుకు రెండు నుంచి 6 కోట్లు తీసుకుంటున్నారు – టాలీవుడ్‌ హీరోలపై కోటా సీరియస్‌

-

ఇప్పుడు సినిమా అనేది లేదు అంతా సర్కస్ అని.. ఇంకొక రామారావు పుడితే తప్ప ఈ భూమి మీద ఇంకొక రామారావు లేడంటూ కోటా శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రామారావు గారు నాగేశ్వరరావు గారు కృష్ణ గారు శోభన్ బాబు గారు రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నారో తెలుసా??? కానీ ఇప్పుడు హీరోలు రోజుకి 2కోట్లు, 6కోట్లు తీసుకుంటున్నాం అని పబ్లిక్ గా చెపుతున్నారు ఇది మంచి పద్ధతి కాదని ఆగ్రహించారు.

రామారావు గారు 60 ఏళ్ల వయస్సులో శ్రీదేవితో డాన్స్ చేస్తే వాళ్లిద్దరు మాత్రమే కనపడ్డారు కానీ ముసలాడు డాన్స్ వేసాడు అని అనరని.. ఈ రోజు సినీ ఆర్టిస్టులు రెండు పూటలా భోజనం చేస్తున్న వాళ్ళు ఎంతమంది వున్నారో మా అసోసియేషన్ గుర్తించాలని డిమాండ్‌ చేశారు. చిన్న సినిమాలు బతకాలి అంటే ఒక కమిటీ వేసి తెలుగు ఆర్టిస్టులతో సినిమా చేస్తే తక్కువ ఖర్చుతో అవుతుంది ఆర్టిస్ట్ లు బాగుంటారని..
చిన్న ఆర్టిస్టులను బ్రతికించండని కోటా శ్రీనివాసరావు కోరారు. ఎదో ఒక అడ్వర్టైజ్ మెంట్ చేద్దాము అనుకుంటే బాత్ రూమ్ క్లిన్ చేసే బ్రష్ దగ్గర నుంచి బంగారం వరకు హీరో లే చేస్తున్నారని.. ఇంక చిన్న ఆర్టిస్ట్ లకు పని ఎక్కడుందన్నారు. దయచేసి ఆలోచన చేసి ఆర్టిస్టుల కు పని దొరికే విధంగా చూడండని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news