నెల్లూరు మరో బీహార్ లా మారుతుంది – ఆనం వెంకటరమణారెడ్డి

-

నెల్లూరు జిల్లా: ఆదివారం ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడి ఘటనపై తాజాగా స్పందించారు ఆనం. బ్లేడ్ బ్యాచ్ లని పంపి సుపారీ దాడులు చేయించడం మాకు పెద్దపని కాదని.. కాని అలాంటి సంస్కృతి మాది కాదన్నారు. మా అధినేత చంద్రబాబు అటువంటివి ప్రోత్సహించరని తెలిపారు. మేము దాడులు చేయగలం అన్నారు. దాడులు చేయించడం కాదు.. ప్లేస్, టైం మీరే చెప్పండని సవాల్ విసిరారు.

టీడీపీ అధికారంలోకి వస్తే మీ ఇళ్లల్లో దూరాలా? మీ కార్యాలయాలపై దాడులు చేయాలా? అని హెచ్చరించారు. పోలీసు అధికారులు సరైన చర్యలు తీసుకుంటే ఈ పరిస్థితి వస్తుందా? అని ప్రశ్నించారు ఆనం. గంజాయి బ్యాచ్ లు, బ్లేడ్ బ్యాచ్ లు ఎక్కువయ్యాయని.. పోలీసుల వల్ల కాకపోతే చెప్పండి.. మేమే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసుకుంటామన్నారు. తనపై దాడికి సంబంధించిన అన్ని ఆధారాలు పోలీసులకి ఇచ్చామని తెలిపారు. ఇప్పుడు కానీ కట్టడి చేయకుంటే నెల్లూరు మరో బీహార్ గా మారుతుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news