హైదరాబాద్​లో రెండు మెట్రో స్టేషన్ల పేర్ల మార్పు

-

హైదరాబాద్ మెట్రో వచ్చిన తర్వాత నగరవాసులకు కాస్త ట్రాఫిక్ కష్టాలు తప్పాయి. ప్రయాణ సమయం తగ్గడం.. గమ్యస్థానానికి త్వరగా చేరుకోవడంతో చాలా మంది ప్రయాణికులు మెట్రోనే ఆశ్రయిస్తున్నారు. దీంతో మెట్రో ప్రయాణికుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ వస్తోంది. ప్రయాణికులను ఆకర్షించేందుకు మెట్రో కూడా అప్పుడప్పుడు ఆఫర్లు ప్రకటిస్తోంది. ఎంతో సౌకర్యవంతమైన, సురక్షితమైన ప్రజారవాణా వ్యవస్థగా హైదరాబాద్ మెట్రోరైలు పేరుపొందిన మెట్రో లాక్​డౌన్​లో మాత్రం నష్టాల బాట పట్టింది. అనంతరం గాడిన పడ్డా.. ఆశించిన మేర ఆదాయం రావడం లేదని మెట్రో యాజమాన్యం చెబుతోంది.

ఇందులో భాగంగా మెట్రో రైలుకు పూర్వవైభవాన్ని తీసుకువచ్చేందుకు.. మెట్రో రైలు ప్రాధాన్యతను ప్రజలకు వివరించడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందుకొచ్చింది. ఇందుకోసం హైదరాబాద్ మెట్రోతో ఎస్‌బీఐ ఒప్పందం చేసుకొంది. ఇందులో భాగంగానే మాదాపుర్‌లోని హైటెక్‌సిటీ, బేగంపేట మెట్రోస్టేషన్ల పేర్లు, బ్రాండింగ్ హక్కులను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దక్కించుకుంది. దీని ప్రకారం హైటెక్‌సిటీ, బేగంపేట పేర్ల ముందు ఎస్‌బీఐ పేరు చేర్చారు ఇక నుంచి ఈ స్టేషన్ల పేర్లు ఎస్​బీఐ హైటెక్​సిటీ మెట్రో స్టేషన్, ఎస్​బీఐ బేగంపేట్ మెట్రో స్టేషన్లుగా మారిపోనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news