ఈ మధ్య బాలీవుడ్ చూపు టాలీవుడ్ వైపునకు పడింది. అందుకే ఇక్కడ హిట్ అయిన సినిమాలను అక్కడ రీమేక్ చేస్తూ కాసుల వర్షం కురిపించుకుంటున్నారు. అయితే కొంత కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరో నాగ చైతన్య ఓ బాలీవుడ్ రీమేక్‌లో నటించనున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ విషయంపై చై టీమ్ క్లారిటీ ఇచ్చింది.
గతేడాది విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సినిమా ‘భూల్ భులయ్యా 2’. కార్తీక్ ఆర్యన్, కియారా అడ్వాణీ, టబు కీలకపాత్రల్లో నటించిన ఈ సినిమాను నాగచైతన్య తెలుగు, తమిళంలో రీమేక్ చేయనున్నారని టాక్ వినిపించింది. ఇక తెలుగులో టబు పాత్రలో జ్యోతిక నటించనుందని అన్నారు. ఈ విషయంపై టీమ్ ట్వీట్ చేస్తూ..
‘‘భూల్ భులయ్యా 2’ లో నాగ చైతన్య నటిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఆ రూమర్స్‌ను నమ్మొద్దు. ఆయన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ మేము అధికారింగా ప్రకటిస్తాం’’ అని స్పష్టం చేసింది. దీంతో ఈ రూమర్స్‌కు చెక్ పడినట్లైంది.