బిగ్‌బాస్‌3: సినిమా థియేటర్లలో శ్రీముఖి యాడ్స్..

-

తెలుగు బుల్లితెర పాపులర్ షో బిగ్ బాస్ క్లైమాక్స్ దశకు చేరుకుంది. మరో రెండు వారాల్లో ఈ షో ముగియనుంది. ఈవారం ఎలిమినేషన్ లో హౌస్ లో ఉన్న మొత్తం ఏడుగురు సభ్యులను బిగ్‌బాస్‌ నామినేట్ చేశాడు. ఈవారం ఎలిమినేషన్లో సింగిల్ కంటెస్టెంట్ ఎలిమినేష‌న్‌ ఉంటుందా ? డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా ? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. చివరి వారం మాత్రం ఫైనల్లో కేవలం ఐదుగురు మాత్రమే హౌస్‌లో ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో బిగ్‌బాస్‌ ఛాంపియన్ కావాలన్న కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది.

ఇక బిగ్ బాస్ హౌస్ లో ఉన్న అందరిలోకి అత్యధిక ఫాలోయింగ్ ఉన్నది యాంకర్ శ్రీముఖికే. బిగ్ బాస్ ఫైనల్స్‌లో శ్రీముఖి ఖ‌చ్చితంగా ఉంటుందన్న అంచనాకు వచ్చేసిన ఆమె అభిమానులు ఇప్పుడు శ్రీముఖి ఆర్మీ పేరిట సోషల్ మీడియాలో నానా హంగామా చేస్తున్నారు. బిగ్‌బాస్‌ 2 సీజన్ లో కౌశల్ ఆర్మీ కూడా ఇదే రేంజ్ లో కౌశ‌ల్‌ను గెలిపించాల‌ని నానా హ‌డావిడి చేసింది.

ఇక ఇప్పుడు మూడో సీజ‌న్లో శ్రీముఖి ఆర్మీ కూడా బిగ్ బాస్ ఓటింగ్ ను శాసిస్తోంది. తాజాగా ఈ వారం శ్రీముఖి నామినేషన్స్ లోకి రావడంతో ఆమె కోసం ఆమె అభిమానులు కొత్త తరహా ప్రచారం చేస్తున్నారు. బిగ్‌బాస్‌లో ఏ కంటెస్టెంట్‌కు లేని విధంగా ప్ర‌చారం కొత్త పుంత‌లు తొక్కిస్తున్నారు. శ్రీముఖి గెలిపించమని ఏకంగా థియేటర్స్ లో యాడ్స్ వేయడం విశేషం.

‘ఓట్ ఫర్ శ్రీముఖి’ అంటూ ఫోన్ నంబర్ తో సహా ఈ ప్రకటన ఇప్పుడు థియేటర్లలో కనిపిస్తోంది. బిగ్ బాస్ విజేతగా శ్రీముఖిని నిలపాలని ఆమె టీమ్ తెగ కష్టపడుతోంది. దీనిపై ఆమె యాంటీ ఫ్యాన్స్ బాగా ట్రోల్ చేస్తున్నారు. హౌస్లో ఆమె మోనార్క్‌లా ఉంద‌ని.. ఆమె కోసం ఎన్ని డ‌బ్బులు ఖ‌ర్చు చేసినా వేస్ట్ అని విమ‌ర్శ‌లు చేస్తుంటే ఆమె ఫ్యాన్స్ మాత్రం బిగ్‌బాస్ విన్న‌ర్ శ్రీముఖియే అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news