BREAKING : రేపు వరుణ్ తేజ్-లావణ్యల ఎంగేజ్మెంట్..అధికారిక ప్రకటన !

-

హీరో వరుణ్ తేజ్ మెగా హీరోలలో ఒకరు. అయితే..టాలీవుడ్ నటి లావణ్య త్రిపాటి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. వరుణ్ తన పుట్టినరోజు సందర్భంగా 25 లక్షల విలువ చేసే డైమండ్ రింగ్ పట్టుకొని బెంగళూరులో ఉన్న లావణ్య త్రిపాఠి వద్దకు వెళ్లారంటూ కూడా జోరుగా వార్తలు వినిపించాయి.

అయితే…. తాజాగా హీరో వరుణ్ తేజ్, టాలీవుడ్ నటి లావణ్య త్రిపాటి పెళ్లి గురించి అధికారిక ప్రకటన వచ్చింది. వరుణ్ తేజ్ లావణ్య ల ఎంగేజ్మెంట్ ఫిక్స్‌ అయింది. జూన్ 9 న నిశ్చితార్థం అని అఫీషియల్ గా ఎనౌన్స్ మెంట్ చేసినట్లు ఓ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. కుటుంబ సభ్యులు సమక్షంలో ఈ ఎంగేజ్ మెంట్ వేడుక జరగనున్నట్లు సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news