వాహనదారులకు శుభవార్త..పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం!

-

దేశంలోని వాహనదారులకు అదిరిపోయే శుభవార్త అందింది. మండుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో ఇబ్బంది పడుతున్న వాహనాదారులకు ఊరట కలిగించే వార్త. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. నష్టాల నుంచి కంపెనీలు దాదాపుగా కోలుకున్నాయని… త్రైమాసిక ఫలితాల్లోనూ రాణించడమే ఇందు కు కారణమని తెలిపాయి.

కాగా, ఇవాళ ప్రారంభమైన పరపతి విధాన కమిటీ సమావేశ నిర్ణయాలను గవర్నర్‌ శక్తికాంత దాస్‌ గురువారం ప్రకటించారు. రెపోరేటును 6.5 శాతం వద్ద కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. ఎంఎస్‌ఎఫ్‌, బ్యాంక్‌ రేట్‌ సైతం 6.75 శాతం వద్ద స్థిరంగా ఉన్నాయని తెలిపారు. రిటైల్‌ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఊతమివ్వాల్సిన అవసరం ఉందనే భావనతోనే కీలక రేట్లలో ఆర్‌బీఐ మార్పులు చేయక పోవచ్చునని గతకొంత కాలంగా విశ్లేషణలు వెలువడుతున్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news