త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న నితిన్ హీరోయిన్..!

-

ఇటీవలే మాస్ మహారాజా రవితేజ నటించిన రావణాసుర సినిమాలో నెగిటివ్ క్యారెక్టర్ లో నటించి మెప్పించిన మేఘా ఆకాష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం ఈమె చేతిలో మరో సినిమా లేదనే చెప్పాలి. ఇకపోతే సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. త్వరలోనే ఈ ముద్దుగుమ్మ పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. తమిళనాడుకు చెందిన రాజకీయ నాయకుడి కుమారుడితో మేఘా ఆకాష్ పెళ్లి ఫిక్స్ అయినట్లు ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు బాగా వినిపిస్తున్నాయి. 2017లో లై అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె ఛల్ మోహన్ రంగా, పేట వంటి చిత్రాలలో నటించింది.

ఈమె నటించిన అన్ని సినిమాల్లో కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో ఈమెకు గుర్తింపు కూడా లభించలేదు. ఇక ఇప్పుడేమో పెళ్లి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహంగా త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఇప్పటివరకు ఈ వార్తలపై మేఘ స్పందించకపోవడం గమనార్హం. ఇటీవలే బూ అనే సినిమాలో నటించిన ఈమె హిందీలో సల్మాన్ ఖాన్ నటించిన రాధే అనే మూవీలో కూడా కీలకపాత్ర పోషించింది.

ప్రస్తుతం అవకాశాలు ఎక్కువగా వస్తున్నా సరే సరైన హిట్ లేక వస్తున్న అవకాశాలను చేజార్చుకుంటుంది. ఇక మరొక పక్క ఈమె ప్రధాన పాత్రలో నటిస్తున్న మను చరిత్ర సినిమా కూడా విడుదలకు సిద్ధం అవుతుంది. వీటితో పాటు తమిళ్ చిత్రాలలో కూడా నటిస్తున్న ఈమె త్వరలోనే బ్యాచిలర్ లైఫ్ ని వీడబోతుందని సమాచారం. ఏది ఏమైనా దీనిపై సరైన క్లారిటీ వచ్చేవరకు ఎదురు చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news