ఆస్ట్రేలియా మరియు ఇండియా ల మధ్య జరుగుతున్న టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో రోహిత్ సేన పట్టు బిగించే సమయం ఆసన్నమైంది. ఆస్ట్రేలియా తమ మొదటి ఇన్నింగ్స్ లో ప్రస్తుతం 422 పరుగులు చేసి 7 వికెట్లను కోల్పోయింది. ఆస్ట్రేలియాను ముందుంది నడిపించిన సెంచరీ వీరులు హెడ్ 163 మరియు స్మిత్ 121 లు అవుట్ అయిన తర్వాత ఇండియా రేస్ లోకి వచ్చినట్లే కనిపించినా ఆ తర్వాత మూడు వికెట్లను పడగొట్టడంలో ఇంకా వెనకే ఉంది. ఇప్పుడు లంచ్ కు వెళ్లిన ఆస్ట్రేలియాను ఎంత త్వరగా ఆల్ అవుట్ చేస్తే అంత మంచిది. ఎటువంటి పరిస్థితుల్లో 450 కు లోపే ఆసీస్ ను కట్టడి చేయాలి. క్రీజులో కీపర్ క్యారీ 22 మరియు కెప్టెన్ కమిన్స్ 2 లు ఉన్నారు.
వీరిని త్వరగా అవుట్ చేసి భారీ స్కోర్ చేయనీయకుండా అడ్డుకోగలిగితే మ్యాచ్ లో గెలవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మరి లంచ్ తర్వాత ఇండియా బౌలర్లు విజృంభిస్తారా చూడాలి.